-
-
Home » Telangana » Rangareddy » rr
-
ఆసుపత్రికి సూదులొచ్చాయ్!
ABN , First Publish Date - 2020-03-13T10:05:26+05:30 IST
ఆసుపత్రికి సూదులొచ్చాయ్!

ఆమనగల్లు : ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రికి సిరంజిలు వచ్చాయి. ‘సర్కారు దవాఖానాలో.. సూదుల్లేవ్ !’ అన్న శీర్షికతో గురువారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రత్యేక కథనానికి అధికారులు స్పందించారు. కొన్ని నెలలుగా సిరంజిలులేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విధి లేక ప్రైవేటు మందుల దుకాణాల్లో కొనుగోలు చేసుకుంటున్నారనే వార్తకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో కదలికలు తెచ్చింది. డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి స్పందించి ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రికి 12 వేల సిరంజిలను కేటాయించారని ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజీం తెలిపారు. మొదటి విడతగా 6వేల సిరంజిలు ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఆమనగల్లు ఆసుపత్రికి 30 వేల సిరంజిలు కావాలని ఇండెంట్‌ను జిల్లా అధికారులకు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఇకపై ఈ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అజీం పేర్కొన్నారు. కాగా సిరంజిల సమస్యను వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’కి రోగులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.