శ్రీనివాసా.. గోవిందా

ABN , First Publish Date - 2020-03-04T10:14:26+05:30 IST

శ్రీనివాసా.. గోవిందా

శ్రీనివాసా.. గోవిందా

 నేటినుంచి లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు

54 యజ్ఞ గుండాలతో శ్రీ సుదర్శన యాగం

ఏర్పాట్లు పూర్తి చేసిన ఆయల కమిటీ

 

పరిగి: పట్టణంలోని బాలాజీనగర్‌లో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏడాది మాఘమాసంలో మూడు రోజుల పాటు ఉత్సవానలు అట్టహాసంగా నిర్వహిస్తారు. టీటీడీ నుంచి రూ.60 లక్షలు, స్థానికంగా సమకూర్చిన రూ.60 లక్షలతో ఆలయాన్ని అత్యద్భుతంగా నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, ఆంజనేయుడు, నాగదేవత విగ్రహాలను ప్రతిష్ఠించారు. దేవాలయ అభివృద్ధిలో భాగంగా గుడి వద్దకు వెళ్లేందుకు సీసీ, బీటీరోడ్ల నిర్మించారు. జాతర సందర్భంగా ఉత్సవాలు తలలివచ్చే భక్తులు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా భక్తులకు మూడు రోజులు నిత్యఅన్నదాన కార్యక్రమాలను నిర్వహి స్తున్నట్లు నిర్వహాకులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు కె.హరీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మంగళవారం హోమాల ఏర్పాట్లను ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి పరిశీలించారు. 


బ్రహ్మాత్సవాల్లో విశేష కార్యక్రమాలు

శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. 4న బుధవారం మహా గణపతిపూజ, పుణ్యహవచనం, అభిషేకం, ధ్వజారోహణం, పచగవ్యపాశంణ, గోవుపూజను నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, 9 నుంచి  54 యజ్ఞ గుండములతో సుదర్శన యాగం, 5న గురువారం వ్రతాలు, హోమాలు, లక్ష్మీతులసీ అర్చన, శ్రీ చండీ హోమం సాయంత్రం అమ్మవారికి సామూహిక కంకుమార్చన, సాయంత్రం 6 గంటలకు ఎదురుకోళ్ల కార్యక్రమం ఉటుంది. 6న శుక్రవారం ఉదయం వేదపారాయణ స్వామికి అభిషేకాలు, ప్రాతఃకాల పూజలు, హోమాలు, శ్రీ లక్ష్మీహోమం, శ్రీ వెంకటేశం, శ్రీ అంజనేయ, నాగధ్వజ హోమాలు, మహా పూర్ణాహుతి, ఉదయం 11.45 గంటలకు స్వామి కల్యాణోత్సవం అనంతరం ఊరేగింపును నిర్వహించారు. ప్రతిరోజూ సాయంత్రం ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ భక్తులకు అన్నదానం చేయనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌పీ బాబయ్య, బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-03-04T10:14:26+05:30 IST