ప్లాస్టిక్‌రహిత పట్టణంగా తీర్చిదిద్దుదాం

ABN , First Publish Date - 2020-03-04T10:09:32+05:30 IST

ప్లాస్టిక్‌రహిత పట్టణంగా తీర్చిదిద్దుదాం

ప్లాస్టిక్‌రహిత పట్టణంగా తీర్చిదిద్దుదాం

షాద్‌నగర్‌: పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ను నిషేధించి పట్టణాన్ని ప్లాస్టిక్‌రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని షాద్‌నగర్‌ ఆర్డీవో రాజేశ్వరి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 9వ రోజు ప్లాస్టిక్‌ను నిషేధించాలని కోరుతూ అన్ని వార్డుల్లో ఆయా వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక 28వ వార్డులో మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌ నేతృత్వంలో నిర్వహించిన ర్యాలీని ఆర్డీవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్‌తో భవిష్యత్తుకు విఘాతం ఏర్పడే ప్రమాదముందని అన్నారు.  ఆయా కార్యక్రమాల్లో కౌన్సిలర్లు టి. ప్రతా్‌పరెడ్డి, ఈశ్వర్‌రాజు, సర్వర్‌పాషా, వెంకట్రామిరెడ్డి, రేటికల్‌ నందీశ్వర్‌, విశాలవిశ్వం, కానుగు అంతయ్య, బచ్చలి నర్సింహ్మా, కృష్ణవేణి, కె. మహేశ్వరి, శాంతమ్మ, శ్రీనివాస్‌ తదితరులున్నారు. 

Updated Date - 2020-03-04T10:09:32+05:30 IST