రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN , First Publish Date - 2020-11-26T05:26:13+05:30 IST

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

బొంరాస్‌పేట్‌: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన బొంరాస్‌పేట్‌ గేట్‌ వద్ద  బుధవారం రాత్రి జరిగింది. మండల కేంద్రానికి చెందిన బ్యాగరి పద్మమ్మ (35) కూలీ పనికి కోసం పరిగికి వెళ్లింది. తిరిగి ఆటో ఎక్కి బొంరాస్‌పేట్‌ గేటు దగ్గర దిగి ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా పరిగివైపు నుంచి వస్తున్న కర్ణాటక ఆర్టీసీ (కేఏ32ఎఫ్‌ 2360) బస్సు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

Read more