రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-12-17T05:33:17+05:30 IST

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఘటనాస్థలంలో రాహుల్‌ మృతదేహం

మేడ్చల్‌: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాహుల్‌(21) బుధవారంసాయంత్రం మేడ్చల్‌- శామీర్‌పేట రోడ్డులో ద్విచక్రవాహనంపై వెళ్తూ మార్గమధ్యలో కిష్టాపూర్‌ వాగువద్ద రోడ్డు పక్కన గల మైలురాయిని ఢీకొన్నాడు. దీంతో కిందపడి తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-12-17T05:33:17+05:30 IST