185 కరోనా కేసుల నమోదు
ABN , First Publish Date - 2020-12-14T04:59:15+05:30 IST
ఉమ్మడి జిల్లాలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్): ఉమ్మడి జిల్లాలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఆదివారం 185 కరోనాపాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 132 కేసులు నమోదు కాగా వికారాబాద్ జిల్లాలో కేవలం 7 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 46 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మూడు జిల్లాల్లో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,06,526కి చేరుకుంది.
చేవెళ్ల డివిజన్‌లో ..
చేవెళ్ల : చేవెళ్ల డివిజన్ పరిధిలో 129 మందికి కరోనా వైద్యపరీక్షలు చేయగా శంకర్‌పల్లికి చెందిన ఒకరికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. అలాగే చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్ తదితర మండలాల్లో నిర్వహించిన వైద్యపరీక్షల్లో అందరికీ నెగటివ్ వచ్చింది. అయితే కొవిడ్ లక్షణాలు ఉన్న వారు తప్పని సరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.
షాద్‌నగర్ డివిజన్‌లో..
షాద్‌నగర్: షాద్‌నగర్ డివిజన్‌లో 179 మందికి కరోనా యాంటీజెన్ పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగటివ్ వచ్చిందని వెద్యులు తెలిపారు.
శంషాబాద్‌లో రెండు కేసులు
శంషాబాద్: శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో 20 మందికి కరోనా పరీక్షలు చేశారు. అందులో ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ నజ్మాభాను తెలిపారు.
వికారాబాద్ జిల్లాలో...
(ఆంధ్రజ్యోతి,వికారాబాద్) : వికారాబాద్ జిల్లాలో ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పరిగిలో 3, తాండూరులో 2, బొంరా్‌సపేట్‌లో ఒక కరోనా కేసు నమోదైంది. ఇంతవరకు జిల్లాలో కరోనా నుంచి 2,816 మంది కోలుకోగా, 56 మంది మృతి చెందినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ సుధాకర్‌సింధే తెలిపారు.