కొత్త ఓటరు గుర్తింపు కార్డులు సిద్ధం

ABN , First Publish Date - 2020-02-08T11:42:17+05:30 IST

జిల్లాలో ఇంతకు ముందు ఏపీ సీరిస్‌తో జారీ చేసిన పాత ఓటరు గుర్తింపు కార్డులకు బదులుగా కొత్త గుర్తింపు కార్డులను సిద్ధం

కొత్త ఓటరు గుర్తింపు కార్డులు సిద్ధం

వికారాబాద్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇంతకు ముందు ఏపీ సీరిస్‌తో జారీ చేసిన పాత ఓటరు గుర్తింపు కార్డులకు బదులుగా కొత్త గుర్తింపు కార్డులను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎలకో్ట్రరల్‌ అధికారి పౌసుమి బసు తెలిపారు. ఇంతకు ముందు 14 డిజిట్లు కలిగిన సంఖ్య ఉంటే కొత్త కార్డులో 10 డిజిట్లతో జారీ చేస్తున్నామని ఆమె చెప్పారు. పరిగి నియోజకవ ర్గానికి సంబంధించి డబ్ల్యుఎల్‌ఈ సీరిస్‌ కార్డులు జారీ చేస్తుండగా, వికారాబాద్‌ నియోజకవర్గం ఆర్‌క్యూవై సీరిస్‌, తాండూరు నియోజకవర్గం ఎక్స్‌ఎల్‌వీ సీరిస్‌, కొడంగల్‌ నియోజకవర్గానికి జడ్‌యూఈ సీరిస్‌తో కొత్త ఓటరు గుర్తంపు కార్డులు జారీ చేస్తున్నారని ఆమె తెలిపారు. పరిగి నియోజకవర్గం లో 66,956 మంది ఓటర్లు, వికారాబాద్‌లో 65,818, తాండూరులో 52,983, కొడంగల్‌ నియోజకవర్గంలో 47,770 మంది ఓటర్లకు కొత్త గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నామని ఆమె చెప్పారు.  కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మార్పు చేసిన ఓటరు గుర్తింపు కార్డులను ఓటర్లు మీ సేవా కేంద్రాల నుంచి తీసుకోవాలని ఆమె సూచించారు. 

Updated Date - 2020-02-08T11:42:17+05:30 IST