వక్ఫ్‌ భూముల పరిశీలన

ABN , First Publish Date - 2020-12-11T04:56:31+05:30 IST

వక్ఫ్‌ భూముల పరిశీలన

వక్ఫ్‌ భూముల పరిశీలన
తహసీల్దార్‌ కార్యాలయంలో వక్ఫ్‌ భూ రికార్డులను పరిశీలిస్తున్న ఆర్డీవో వేణుమాధవరావు

షాబాద్‌: షాబాద్‌ రెవీన్యూ పరిధిలోని వక్ఫ్‌ బోర్డు భూ రికార్డులపై చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవరావు గురువారం ఆరా తీశారు. షాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ అమరలింగంగౌడ్‌తో కలిసి షాబాద్‌ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 1లో ఉన్న వక్ఫ్‌ బోర్డుకు సంబంధించిన భూరికార్డులను పరిశీలించారు. సర్వేయర్‌ రవితో సర్వే నంబర్‌ 1లోని వక్ఫ్‌బోర్డు భూమిని సర్వే చేయించారు. రికార్డులు పరిశీలించి వక్ఫ్‌బోర్డుకు ఉన్న భూమి కేటాయించనున్నట్టు ఈ సందర్భంగా ఆర్డీవో తెలిపారు. 


Updated Date - 2020-12-11T04:56:31+05:30 IST