విమానాశ్రయంలో ప్రయాణికుడి అదృశ్యం

ABN , First Publish Date - 2020-03-11T11:48:46+05:30 IST

విదేశం నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికుడు...

విమానాశ్రయంలో ప్రయాణికుడి అదృశ్యం

 శంషాబాద్‌ : విదేశం నుంచి  శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అతని బంధువులు ఫిర్యాదు చేడయంతో పోలీసుల కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వెస్ట్‌గోదావరి జిల్లా అత్తిలి మండలం వరిగేడు గ్రామానికి చెందిన మణికంఠ (32) క్రితం సింగపూర్‌ వెళ్లాడు. సింగపూర్‌ నుంచి సోమవారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన మణికంఠ అక్కడినుంచి ఇంటికి వెళ్లలేదు. దీంతో బంధువులు అతని ఆచూకీకోసం వెతికినా జాడతెలియలేదు. దీంతో ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేయగా  మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-03-11T11:48:46+05:30 IST