జోసెఫ్‌కు కరోనా లేదు.. వెల్లడించిన వైద్య బృందం

ABN , First Publish Date - 2020-03-18T05:30:00+05:30 IST

పట్టణంలోని అయ్యప్పకాలనీలోని తన పెద్దనాన్న రాజారెడ్డి ఇంటికి ఈ నెల 16న వచ్చిన జోసెఫ్‌కు కరోనా వ్యాధి లేదని గాంధీ ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయని షాద్‌నగర్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వో

జోసెఫ్‌కు కరోనా లేదు.. వెల్లడించిన వైద్య బృందం

షాద్‌నగర్‌: పట్టణంలోని అయ్యప్పకాలనీలోని తన పెద్దనాన్న రాజారెడ్డి ఇంటికి ఈ నెల 16న వచ్చిన జోసెఫ్‌కు కరోనా వ్యాధి లేదని గాంధీ ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయని షాద్‌నగర్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ చందూ నాయక్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ జె. శ్రీనివాసులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 27న ఇటలీ నుంచి వచ్చిన జోసెఫ్‌ శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగి నేరుగా జడ్చర్లలోని తన చిన్నాన్న ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 16న జోసెఫ్‌ షాద్‌నగర్‌లో ఉంటున్న తన పెద్దనాన్న ఇంటికీ వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న వైద్యాధికారులు అతన్ని గాంధీకి తరలించారు. రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వహించి జోసెఫ్‌కు కరోనా లేదని వైద్యులు తేల్చారు.

Updated Date - 2020-03-18T05:30:00+05:30 IST