కరోనాతో కళతప్పిన కన్హాశాంతివనం

ABN , First Publish Date - 2020-03-18T05:30:00+05:30 IST

కన్హాశాంతివనంలోని రామచంద్రమిషన్‌ హార్ట్‌పుల్‌నెస్‌ సంస్థ ఎప్పుడూ అభ్యాసికులతో కళకళలాడేది. అలాంటి ఆశ్ర మం నేడు కరోనా ఎఫెక్ట్‌తో బోసిపోతుంది. రామచంద్రమిషన్‌ హార్ట్‌పుల్‌నెస్‌ సంస్థ

కరోనాతో కళతప్పిన కన్హాశాంతివనం

నందిగామ: కన్హాశాంతివనంలోని రామచంద్రమిషన్‌ హార్ట్‌పుల్‌నెస్‌ సంస్థ ఎప్పుడూ అభ్యాసికులతో కళకళలాడేది. అలాంటి ఆశ్ర మం నేడు కరోనా ఎఫెక్ట్‌తో బోసిపోతుంది. రామచంద్రమిషన్‌ హార్ట్‌పుల్‌నెస్‌ సంస్థ 75వ వార్షికోత్సవాన్ని జనవరిలో నిర్వహించారు. అప్పటికే కరోనా వ్యాధి బయటికి వచ్చినప్పటికీ భారత్‌కు వ్యాప్తి చెందలేదు. ప్రస్తుతం ఇక్కడ కూడా కరోనా వ్యాధి విజృంభిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళాశాలలకు, పాఠశాలలకు, మాల్స్‌, సినిమా థియేటర్లు మూసివేయాలని ఆదేశించాయి. అదేవిధంగా కన్హాశాంతివనం నిర్వాహకులు అభ్యాసికులను, కూలీలను ఆశ్రమం నుంచి పంపించేస్తున్నారు. దీంతో పనిలేక కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి 31 వరకు అభ్యాసికులు ఇంట్లోనే ధ్యానం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా కూలీలు కూడా మార్చి 31 తర్వాతే పనుల్లోకి రావాలని తెలిపారు. 

Updated Date - 2020-03-18T05:30:00+05:30 IST