పరిగిలో ఉపాధి పథకం ఎఫ్‌ఏల ర్యాలీ

ABN , First Publish Date - 2020-03-18T05:30:00+05:30 IST

ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్‌అసిస్టెంట్ల సమ్మె బుధవారం ఏడో రోజుకు చేరుకుంది. పరిగి,దోమ, కులకచర్ల, పూడూరు మండలాల్లోని ఫీల్డ్‌సిస్టెంట్లు పరిగి మండల పరిషత్‌ ఆవరణలో సమ్మె చేపట్టారు.

పరిగిలో ఉపాధి పథకం ఎఫ్‌ఏల ర్యాలీ

పరిగి: ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్‌అసిస్టెంట్ల సమ్మె బుధవారం ఏడో రోజుకు చేరుకుంది. పరిగి,దోమ, కులకచర్ల, పూడూరు మండలాల్లోని ఫీల్డ్‌సిస్టెంట్లు పరిగి మండల పరిషత్‌ ఆవరణలో సమ్మె చేపట్టారు. అనంతరం ఫీల్డ్‌అసిస్టెంట్లు అంతా కలిసి మండల పరిషత్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహనికి వినతిపత్రాన్ని అందజేశారు. కనీస వేతనం నెలకు రూ.21 వేలు పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం కార్యదర్శి వెంకటయ్య, నాయకులు హబీబ్‌, ఉపాధీ హామీ పీల్ట్‌ అసిస్టెంట్‌ ల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌, అంజిరెడ్డి. వెంకట్‌రెడ్డి,రాఘవేందర్‌రావు, వెంకటయ్య, అంజి, మహేందర్‌, శంకర్‌, మల్లెశ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఫీల్డ్‌అసిస్టెంట్లకు నోటీసు జారీ

పూడూరు: మండల పరిధిలోని ఆయా గ్రామాల ఈజీఎస్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్లు గురువారం నుంచి విధులకు హాజరు కాకపోతే వారిని తొలిగించి కొత్తవారిని తీసుకుంటామని, మొండి వైఖరి మాని తక్షణమే విధుల్లో చేరాలని ఎంపీడీవో ఉశ బుధవారం ఫీల్డ్‌ అసిస్టెంట్లుకు గ్రామ కార్యదర్శులతో షోకాజ్‌ నోటీసులు అందజేశారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు విధుల్లో చేరబోమని, షోకాజ్‌ నోటీసులు తీసుకోబోమని ఫీల్డ్‌ అసిస్టెంట్లు తేల్చిచెప్పారు. పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఇళ్ల గోడలపై షోకాజ నోటీసులు అంటించి వెళ్లారు.



Updated Date - 2020-03-18T05:30:00+05:30 IST