-
-
Home » Telangana » Rangareddy » rangareddy
-
పోలీసుల పహారాలో మీర్‌పేట్ మున్సిపల్ కార్యాలయం
ABN , First Publish Date - 2020-12-30T17:11:45+05:30 IST
జిల్లాలోని మీర్‌పేట్ కార్పొరేషన్‌లోని లెనిన్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన బీజేపీ దిమ్మను అనుమతి లేదంటూ నిన్న మున్సిపల్ అధికారులు కూల్చివేశారు.

రంగారెడ్డి: జిల్లాలోని మీర్‌పేట్ కార్పొరేషన్‌లోని లెనిన్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన బీజేపీ దిమ్మను అనుమతి లేదంటూ నిన్న మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. దీంతో వివాదం చెలరేగింది. మున్సిపల్ కమిషనర్ దురుసుగా ప్రవర్తించారంటూ దానికి నిరసనగా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కార్యాలయం ముందు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు చేరుకోవడంతో టెన్షన్ నెలకొంది.