ఆడపిల్లల రక్షణ అందరి బాధ్యత

ABN , First Publish Date - 2020-11-20T04:25:35+05:30 IST

ఆడపిల్లల రక్షణ అందరి బాధ్యత

ఆడపిల్లల రక్షణ అందరి బాధ్యత
ప్రతిజ్ఞ చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ అందె వెంకటేశ్వర్లు

ఇబ్రహీంపట్నం: ఆడపిల్లలను ప్రోత్సహిస్తే అన్నిరంగాల్లో మరింత రాణిస్తారని, వారి రక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ అందె వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా చైల్డ్‌లైన్‌ 1098 ఆధ్వర్యంలో గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాల్య దశ నుంచే మంచి నడవడిక నేర్పాలని అన్నారు. ఉన్నతస్థాయికి ఎదిగేలా తగు కార్యాచరణతో ముందుకెళ్లాలని సూచించారు. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, అలా చేస్తే చర్యలు తప్పవని అన్నారు. బాలికల రక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఇంకా అక్కడక్కడా అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయని, దీనికి గల కారణాలను అన్వేషించి పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. పిల్లల రక్షణ కోసం రంగవల్లుల రూపంలో వేసిన చిత్రాలను అతిథులు తిలకించారు. సీడీపీవో జి.శాంతిశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ పి.కృపేష్‌, జడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతి, ఎస్‌ఐ నాగేందర్‌, ఏపీఎం రవీందర్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పద్మ, అంజలి, పద్మావతి, జిల్లా చైల్డ్‌లైన్‌ కోఆర్డినేటర్‌ శేఖర్‌, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు


Updated Date - 2020-11-20T04:25:35+05:30 IST