ధ్యానం ద్వారా ఆనందమయ జీవనం
ABN , First Publish Date - 2020-12-31T04:50:44+05:30 IST
ధ్యానం ద్వారా ఆనందమయ జీవనం
- ప్రపంచ ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ
- కొనసాగుతున్న మహిళా ధ్యాన మహోత్సవాలు
ఆమనగల్లు : ధ్యాన సాధన ద్వారా ఆనందమయ జీవనం పొందవచ్చునని ప్రపంచ ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ అన్నారు. కడ్తాల్ మండలం అన్మా్‌సపల్లి గ్రామ సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్‌లో ధ్యానమహోత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. మహిళా డిజిటల్ ధ్యాన మహాచక్రం-2 భాగంగా 10వ రోజు బుధవారం పత్రీజీ ప్రాతఃకాలం వేణునాధ ధ్యానంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పత్రీజీ మాట్లాడుతూ ధ్యానం వల్ల జ్ఞాన సంపద లభిస్తుందన్నారు. ధ్యాన, శాఖాహార జగతే పిరమిడ్ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్టీ వైస్ చైర్మన్ కోర్పోలు విజయభాస్కర్‌రెడ్డి, మేనేజింగ్ ట్రస్టీ రాంబాబు, సభ్యులు దామోదర్, సాంబశివరావు, సురే్‌షబాబు, హన్మంతరాజు, నందప్రసాద్, ప్రేమయ్య, నవకాంతు, దీప్తిరెడ్డి, మాధవి, లక్ష్మీ, రవిశాస్ర్తీ, జ్యోతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ధ్యాన మహాసభలలో కళాకారు ల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. శ్రీకాకుళం కళాబృందం కూచిపూడి, భరతనాట్యం, నృత్యరూపకాలు ధ్యానులను మైమరిపించాయి. అనంతరం ధ్యాన మహోత్సవ వేడుకల్లో భాగంగా ఆధ్యాత్మిక వేత్తలు రచించిన పుస్తకాలను పత్రీజీ ఆవిష్కరించారు.
వేదికపై ఒక్కటైన జంట
ధ్యాన వేదిక ఇద్దరి మనసులను కలిపింది. విజయనగరం జిల్లాకు చెందిన మణికంఠ, గ్రీష్మలు ధ్యాన సాధన చేస్తున్నారు. ఈ క్రమంలో పిరమిడ్‌లో కలుసుకున్న వీరిద్దరి మనసులు కలిశాయి. బుధవారం పత్రీజీ సతీమణి స్వర్ణమాల, ట్రస్ట్ సభ్యుల సమక్షంలో వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.