-
-
Home » Telangana » Rangareddy » pyramid meditation celebrations
-
ధ్యానం ద్వారా జ్ఞానం
ABN , First Publish Date - 2020-12-29T04:43:55+05:30 IST
ధ్యానం ద్వారా జ్ఞానం

- ప్రపంచ ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ
ఆమనగల్లు : ధ్యానం ద్వారా జ్ఞానం, సంకల్ప శక్తి, సహనం సిద్ధిస్తుందని ప్రపంచ ధ్యాన గురువు, పిరమిడ్ స్పిరిచ్యువల్ మూమెంట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు సుభాష్ పత్రీజీ అన్నారు. కడ్తాల మండలం అన్మా్‌సపల్లి గ్రామ సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్‌లో ధ్యానమహోత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ద్యాన మహాచక్రం-2లో భాగంగా 8వ రోజు సోమవారం ఉదయం వేణునాథ ధ్యానంతో పత్రీజీ ధ్యాన సంబురాలను ప్రారంభించారు. ఽకాగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అదరహో అనిపించాయి. పలువురు ధ్యానులు, ఆధ్యాత్మిక వేత్తలు రచించి రూపొందించిన పుస్తకాలను పత్రీజీ ఆవిష్కరించారు. అదేవిధంగా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ర్టాలకు చెందిన ఆధ్యాత్మిక వేత్తలు ధ్యానులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆనందమయ జీవితానికి ధ్యానం గొప్ప సాధనమని పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూమెంట్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల అధ్యక్షుడు ఎస్‌ఆర్ ప్రేమయ్య, చీఫ్ ప్యాట్రన్ వైడి గుప్తా అన్నారు. ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామంలో పిరమిడ్ మాస్టర్ బల్‌రాం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించే పిరమిడ్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.