పర్యావరణహితం కోసమే ప్రజా మరుగుదొడ్లు

ABN , First Publish Date - 2020-08-16T09:57:16+05:30 IST

పర్యావరణహితం కోసమే ఇబ్రహీంపట్నంలో పజా మరుగుదొడ్లు నిర్మించినట్లు ఇ బ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు

పర్యావరణహితం కోసమే ప్రజా మరుగుదొడ్లు

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 


ఇబ్రహీంపట్నం: పర్యావరణహితం కోసమే ఇబ్రహీంపట్నంలో పజా మరుగుదొడ్లు నిర్మించినట్లు ఇ బ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా ఓడీఎఫ్‌ నగరంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన ప్రజా మరుగుదొడ్లను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. రూ.29 లక్షలతో  పట్టణంలోని నాలుగుచోట్ల వీటిని నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరూకూడా బహిరంగమలమూత్ర విసర్జన చేయరాదనే ఉద్ద్దేశంతో వీటిని నిర్మించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్రవంతి, వైస్‌ చైర్మన్‌ ఆకుల యాదగిరి, ఎంపీపీ కృపేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-16T09:57:16+05:30 IST