111జీవోలో పాత పద్ధతి కోసం ఆందోళన

ABN , First Publish Date - 2020-12-30T04:34:34+05:30 IST

111జీవోలో పాత పద్ధతి కోసం ఆందోళన

111జీవోలో పాత పద్ధతి కోసం ఆందోళన
షాద్‌నగర్‌ అర్బన్‌ : రియల్టర్లకు మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్‌ నేత శంకర్‌

  • రియల్టర్లకు మద్దతు తెలిపిన నాయకులు

మొయినాబాద్‌: జీఓ 111 పరిధి 84 గ్రామాల్లో వెంటనే పాత విధానంలో ప్లాట్ల రిజిస్ర్టేషన్లు చేయాలని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం మొయినాబాద్‌లో ఆయన మాట్లాడుతూ... గతంలో 111జీఓ గ్రామాల్లో ప్లాట్లు రిజిస్ర్టేషన్‌ చేసి ఆదాయం సమకూర్చుకున్న ప్రభుత్వం ఉన్నట్టుండి ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రకటించి రిజిస్ర్టేషన్లు ఆపడం సమంజసం కాదన్నారు. రిజిస్ట్రేషన్లు ఆపడంతో అమ్మాలనుకున్న వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, కొనాలనుకునే వారు కొనలేకపోతున్నారని తెలిపారు. జీఓ 111ను ఎత్తేస్తామని చెప్పిన ప్రభుత్వం కొత్తగా ఎల్‌ఆర్‌ఎ్‌సను తెచ్చిందన్నారు. 111జీవోను ఎత్తివేయించేందుకే పార్టీ మారుతున్నట్టు చెప్పిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య.. ఇప్పుడు జీవో గురించి అడుగుతున్న వారిపై దుర్భాషలాడటం పద్ధతి కాదన్నారు. పాత పద్ధతిలో వెంటనే రిజిస్రేషన్లు ప్రారంభించకుంటే ప్రజలు ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు షాబాద్‌ దర్శన్‌, మాణయ్య, మోత్కుపల్లి రాములు, బి.సత్యనారాయణ, వసంతం, ఎంపీటీసీ రాంరెడ్డి, మండల నాయకులు వెంకట్‌రెడ్డి, శ్రీనివా్‌సయాదవ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.


గండిపేట చెరువు పరిసరాల సందర్శన

హిమాయత్‌నగర్‌ సమీప గండిపేట చెరువు పరిసర ప్రాంతాలను కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. సమీపంలోని గ్రామాల డ్రెయిన్లన్నీ చెరువులోకి చేరుతుండడంతో నీరంతా మురికిగా మారి తాగేందుకు పనికి రాకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం గ్రీన్‌ ట్రిబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఆయనతో మానయ్య, మహేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


ఎల్‌ఆర్‌ఎ్‌సతోనే టీఆర్‌ఎస్‌ పతనం

షాద్‌నగర్‌ అర్బన్‌: కరోనా మహమ్మారితో ఒకపక్క ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా  వారిని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టుతూ ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎ్‌సతోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని కాంగ్రెస్‌ పార్టీ షాద్‌నగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వీర్లపల్లి శంకర్‌ అన్నారు. ఎల్‌ఆర్‌ఎ్‌సను రద్దు చేయాలని మంగళవారం సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు సిద్ధమైన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను పోలీసులు అరెస్టులు చేసి స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న శంకర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులను వెంటబెట్టుకొని వెళ్లి రియల్టర్లకు మద్దతు తెలిపారు. ప్లకార్డుల నిరసనతో ఎల్‌ఆర్‌ఎ్‌సను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్తకొత్త నిబంధనలు విధిస్తోందన్నారు. ఇన్నాళ్లు ఎల్పీ నెంబర్లు లేని ప్లాట్లను కూడా రిజిస్ట్రేషన్‌ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఎందుకు నిషేధం విధించిందని ప్రశ్నించారు. ఎల్‌ఆర్‌ఎ్‌సను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సైతం వ్యతిరేకిస్తున్నారని గుర్తుచేశారు. నిరసనలో కాంగ్రెస్‌ నాయకులు బాబర్‌ఖాన్‌, జి.బాల్‌రాజ్‌గౌడ్‌, కొమ్ము కృష్ణ, శ్రీశైలం, శ్రీకాంత్‌రెడ్డి, ఖదీర్‌, రాజు, సీతారాములు, అప్పి పాల్గొన్నారు.  


రియల్టర్ల ముందస్తు అరెస్టు

ఎల్‌ఆర్‌ఎ్‌సను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్నాకు సిద్ధమైన రియల్టర్లను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రాజుగౌడ్‌, ఎండీ అజ్మిత్‌, మురళీమోహన్‌, ఎం.అశోక్‌, సాధిక్‌, కబీర్‌, గౌస్‌, ఎల్‌.సుధాకర్‌రెడ్డి, సతీష్‌, ప్రభాకర్‌, హైదర్‌ఘోరీ, అలీం, శంకర్‌నాయక్‌, మురళి పాల్గొన్నారు.


హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం

షాద్‌నగర్‌ అర్బన్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు జాతీయ రహదారులను స్తంభింపజేస్తే లేని తప్పు.. ఎల్‌ఆర్‌ఎ్‌సను రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేస్తే తప్పా అని బీజేపీ జిల్లా లీగల్‌సెల్‌ అధ్యక్షుడు చెంది మహేందర్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందన్నారు. మంత్రులకు ఓ న్యాయం... ప్రజలకోన్యాయమా అని ప్రశ్నించారు. 


కేసీఆర్‌ నియంత పాలన

షాబాద్‌: సీఎం కేసీఆర్‌ నియంత పాలన కొనసాగిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ మండల అఽధ్యక్షుడు కావలి చంద్రశేఖర్‌ విమర్శించా రు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎస్‌ తో పేద, మధ్యతరగతి ప్రజల నడ్డివిరుస్తున్నారని మండిపడ్డారు. 


బీజేవైఎం నేతల ముందస్తు అరెస్ట్‌

ఆమనగల్లు : ఎల్‌ఆర్‌ఎస్‌ను వెంటనే రద్దు చేయాలని మండల కేంద్రాల్లో బీజేవైఎం నాయకుల తలపెట్టిన ధర్నా నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమనగల్లులో మంగళవారం బీజేపీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. 

Updated Date - 2020-12-30T04:34:34+05:30 IST