-
-
Home » Telangana » Rangareddy » Preparing current bills
-
కరోనా షాక్
ABN , First Publish Date - 2020-05-13T05:37:52+05:30 IST
కరోనా కష్టాలు కరెంట్ సంస్థనూ తాకాయి. ప్రతినెలా వంద శాతానికి సమీపంలో ఉండే విద్యుత్ బిల్లుల వసూళ్లు.. గత నెల

విద్యుత్ సంస్థలకు వసూలు కాని బిల్లులు
ఏప్రిల్ నెలలో సగమే వసూలు
రూ.8.12 కోట్లకు రూ.3.28 కోట్లు చెల్లింపు
మే నెల వసూలు లక్ష్యం రూ.13.07 కోట్లు
సిద్ధమవుతున్న కరెంట్ బిల్లులు
ఆన్‌లైన్‌లో చెల్లించాలంటున్న విద్యుత్ అధికారులు
లాక్‌డౌన్ కారణంగా రెండు నెలల నుంచి కరెంటు బిల్లులు వసూలు కావడం లేదు. వసూళ్లలో 50శాతం కూడా చెల్లింపులు జరగలేదు. ఇంటింటికీ తిరిగి బిల్లులు వసూలు చేయడానికి, కౌంటర్లలో బిల్లులు తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించాలని విద్యుత్ అధికారులు కోరినా వినియోగదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడంలేదు.
(ఆంధ్రజ్యోతి, వికారాబాద్) : కరోనా కష్టాలు కరెంట్ సంస్థనూ తాకాయి. ప్రతినెలా వంద శాతానికి సమీపంలో ఉండే విద్యుత్ బిల్లుల వసూళ్లు.. గత నెల వెలవెలబోయాయి. మార్చి నెలకు సంబంధించి ఏప్రిల్ నెలలో చెల్లించాల్సిన బిల్లుల్లో 40 శాతం మాత్రమే వచ్చాయి. కరోనాకు చెక్ పెట్టేందుకు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో ఇంటింటికీ తిరిగి మీటర్ రీడింగ్ నమోదు చేసే పరిస్థితి లేదు. దీంతో గతేడాది మార్చి నెల బిల్లులనే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వసూలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎ్‌సఆర్‌ఈసీ) విద్యుత్ సంస్థలకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.. 2019, మార్చి నెలకు సంబంధించి ఏప్రిల్ నెలలో జిల్లాలో రూ.8.12 కోట్ల విద్యుత్ బిల్లుల డిమాండ్ ఉండగా, లాక్‌డౌన్ కారణంగా అదే డిమాండ్ మేరకు బిల్లులు వసూలు చేయాలనే లక్ష్యాన్ని విద్యుత్ శాఖ అధికారులు నిర్దేశించుకున్నారు. మార్చి నెలకు సంబంఽధించి ఎంత బిల్లు చెల్లించాలనే సమాచారాన్ని వినియోగదారుల సెల్‌ఫోన్లలో మెసేజ్ పంపించారు.
ఇంటింటికీ తిరిగి బిల్లులు వసూలు చేయడానికి, కౌంటర్లలో బిల్లులు తీసుకోవడానికి అవకాశం లేకపోవడంతో వినియోగదారులు పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి డిజిటల్ యాప్స్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయాలని విద్యుత్‌శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. మార్చి నెలకు సంబంధించి రూ.8.12 కోట్ల బిల్లులు ఏప్రిల్ నెలలో వసూలు చేయాల్సి ఉండగా, కేవలం రూ.3.20 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. కరెంట్ బిల్లుల వసూళ్లలో ముందుండే వికారాబాద్ జిల్లా కరోనా కారణంగా వెనుకబడిపోయింది. సకాలంలో బిల్లులు చెల్లించాలని ప్రసార, ప్రచార సాధనాలు, సామాజిక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేసినా వినియోగదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడంలేదు.
మే నెల బిల్లుల లక్ష్యం రూ.13.07 కోట్లు
ఇదిలా ఉంటే, లాక్‌డౌన్ పొడిగింపు కారణంగా ఈ నెలలోనూ గత నెల మాదిరిగానే బిల్లులు వసూలు చేసేందుకు విద్యుత్ శాఖ అఽధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 2,95,840 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 2,08,630 గృహ కనెక్షన్లు, 19,027 కమర్షియల్, 3,019 చిన్నతరహా పరిశ్రమలు, 1,864 వీధి దీపాలు, 1,746 తాగునీటి సరఫరా (పీడబ్ల్యుఎస్), 1,424 కేటగిరి -7 కనెక్షన్లు, 982 ఇతర కనెక్షన్లు, 72 పెద్దతరహా పరిశ్రమల కనెక్షన్లు ఉన్నాయి. జిల్లాకు సంబంధించి 2020, ఏప్రిల్ నెలలో రూ.13.07 కోట్ల విద్యుత్ బిల్లులు వసూలు చేయాల్సిన లక్ష్యం ఉంది. గత ఏడాది ఏప్రిల్ నెలలో వినియోగించిన కరెంట్‌కు మే నెలలో ఎంత బిల్లు వసూలు చేశారో అంతే మొత్తానికి బిల్లు వసూలు చేసేందుకు టీఎ్‌సఆర్‌ఈసీ విద్యుత్ సంస్థలకు అనుమతి ఇచ్చింది.
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మార్చి రెండోవారం నుంచి మీటర్ల రీడింగ్ నమోదు ప్రక్రియను నిలిపివేసిన విషయం తెలిసిందే. గతేడాది ఏప్రిల్ నెలలో వినియోగించిన యూనిట్ల కరెంట్ బిల్లును మాత్రమే ఇప్పుడు తీసుకోనున్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత మీటర్ రీడింగ్ తీసుకుని ఏమైనా హెచ్చుతగ్గులు ఉంటే ఆ తరువాత వచ్చేనెల బిల్లులో సర్దుబాటు చేయనున్నారు. టీఎ్‌సఈఆర్‌సీ మార్గదర్శకాల మేరకు టీఎ్‌సఎ్‌సపీడీసీఎల్ జిల్లా అధికారులు కేటగిరీల వారీగా విద్యుత్ బిల్లులు సిద్ధం చేశారు. ఈనెల వసూలు చేయాల్సిన బిల్లులతోపాటు గత నెల బకాయిలను కూడా వసూలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో చెల్లించండి
ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఇంటింటికీ తిరిగి బిల్లులు వసూలు చేయలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వినియోగదారులు ఆన్‌లైన్‌లో చెల్లించాలని టీఎ్‌సఎ్‌సపీడీసీఎల్ జిల్లా ఎస్‌ఈ జానకిరాములు తెలిపారు. ఎస్‌పీడీసీఎల్, ఫోన్‌పే, గూగుల్ పే వంటి ఆన్‌లైన్ యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టీఎ్‌సఈఆర్‌సీ, టీఎ్‌సఎ్‌సపీడీసీఎల్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వినియోగదారులు చెల్లించాల్సిన బిల్లుల సమాచారాన్ని వినియోగదారులకు పంపించామని ఆయన చెప్పారు.