పది పరీక్షలకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2020-03-16T06:19:19+05:30 IST

మండల పరిధిలో 19నుంచి నిర్వహించే పదో తరగతి వార్షిక పరీక్షలకు నాలుగు పరీక్షా కేంద్రాల్లో 810మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు మండల ఇన్‌చార్జి ఎంఈవో వినోద్‌కుమార్‌ తెలిపారు.

పది పరీక్షలకు సర్వం సిద్ధం

ఇన్‌చార్జి ఎంఈవో వినోద్‌కుమార్‌


యాచారం: మండల పరిధిలో 19నుంచి నిర్వహించే పదో తరగతి వార్షిక పరీక్షలకు నాలుగు పరీక్షా కేంద్రాల్లో 810మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు మండల ఇన్‌చార్జి ఎంఈవో వినోద్‌కుమార్‌ తెలిపారు. పుడమి పాఠశాలలో 210 మంది, యాచారం, గున్‌గల్‌, నందివనపర్తి సెంటర్లలో 180మంది చొప్పున  విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఇందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. ఉదయం 9.15 నుంచి 12.15 వరకు పరీక్షను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో 18 నుంచి 20మంది సిబ్బందిని నియమించామన్నారు. విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Updated Date - 2020-03-16T06:19:19+05:30 IST