26 మంది ఉపాధ్యాయుల ముందస్తు అరెస్టు
ABN , First Publish Date - 2020-12-30T05:10:59+05:30 IST
26 మంది ఉపాధ్యాయుల ముందస్తు అరెస్టు
వికారాబాద్, (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి, ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మహా ధర్నాకు జిల్లా నుంచి తరలి వెళ్లకుండా పోలీసులు 26 మందిని ముందస్తుగా అరెస్టు చేశారు. ఽహైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో నిర్వహించిన మహాధర్నాకు హాజరుకాకుండా అరెస్టుల పర్వం కొనసాగించినా జిల్లా నుంచి ఉపాధ్యాయ సంఘాల నేతృత్వంలో ఉపాధ్యాయులు తరలి వెళ్లారు.
టీఎస్ యూటీఎఫ్ నాయకుల అరెస్టు
తాండూరు: ఉదయం ఏడు గంటల ప్రాంతంలో టీఎస్ యూటీఎఫ్ తాండూరు, పెద్దేముల్, బషీరాబాద్, మండలాల అధ్యక్షులు ఎం.నారాయణగౌడ్, రాములు, విఠల్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి వెంకటప్ప, వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహులు, శేఖర్, పురుషోత్తం తాండూరులోని ఇంటికి వచ్చారు. పోలీసులు వీరిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.
ఉపాధ్యాయుల అక్రమ అరెస్టు హేయం
దౌల్తాబాద్: సమస్యలు పరిష్కరించాలని మంగళవారం మహాధర్నాకు బయలుదేరిన ఉపాధ్యాయులను ఎక్కడికక్కడే అరెస్టులు చేయడం తగదని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెప్ప అన్నారు. మహాధర్నాకు తరలి వెళ్లిన వారిలో బసప్ప, అశోక్, నర్సింగ్, ముత్యప్ప, మహిపాల్‌రెడ్డి, లక్ష్మణ్, మోసెస్, మల్లికార్జున్, మల్లేశ్, రాములు, రమేశ్, మైపాల్‌రెడ్డి, రాజరత్నం, ధరంసింగ్, అంజిలప్ప, బసంత్ తదితరులు ఉన్నారు.