ఉద్యోగుల పీఆర్సీ ప్రకటించాలి
ABN , First Publish Date - 2020-12-18T04:35:12+05:30 IST
ఉద్యోగుల పీఆర్సీ ప్రకటించాలి

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.జనార్దన్‌రెడ్డి
చేవెళ్ల: ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను వెంటనే ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం చేవెళ్ల పట్టణంలోని వివేకానంద కళాశాలలో జరిగిన సంఘం చేవెళ్ల డివిజన్‌స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలని, సీపీఎ్‌సను రద్దు చేసి ఓపీఎ్‌సను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి గణపురం సురధీర్, డివిజన్ ఇన్‌చార్జి మోర లక్ష్మణ్, కార్యదర్శి కె.శ్రీకాంత్, మండల గౌరవ అధ్యక్షులు సి.మహిపాల్‌రెడ్డి, దూత కృష్ణ, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, శంకర్‌పల్లి, మొయినాబాద్, షాబాద్ మండలాల అధ్యక్షులు శ్రీనివాస్, పెంటయ్య, నాగశ్, ప్రధాన కార్యదర్శులు లక్ష్మారెడ్డి, వినోద్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎంపిక
చేవెళ్ల మండల నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. మండల గౌరవ అఽధ్యక్షులుగా మహిపాల్‌రెడ్డి, అధ్యక్షుడు దూత కృష్ణ, ఉపాఽధ్యక్షులు కరుణకర్‌రెడ్డి, బస్వరాజ్, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, మహిళ ఉపాఽధ్యక్షులు యాదమ్మ, కోశాధికారి దయాకర్‌రెడ్డి, మహిళ కార్యదర్శులు సుజాత, మంజుల, కార్యదర్శులుగా మోహన్, హరిశంకర్, మిగితా కార్యవర్గ సభ్యులను ఎంపిక చేశారు.