-
-
Home » Telangana » Rangareddy » poojas for people
-
ప్రజల మేలు కోసమే పూజలు
ABN , First Publish Date - 2020-12-27T05:37:03+05:30 IST
ప్రజల మేలు కోసమే పూజలు

కందుకూరు: ప్రజలకు 2020వ సంవత్సరం అచ్చి రాలేదని, 2021 ఏడాదిలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నట్లు బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్‌చార్జి అందెల శ్రీరాములుయాదవ్ తెలిపారు. శనివారం పులిమామిడి చీకటి వేంకటేశ్వరాలయంలో పార్టీ నేతలతో కలిసి పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి, భారీ వర్షాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. ఇక్కడ అక్కన్న మాదన్నలు నిర్మించిన ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో మంద జ్యోతి, అనేగౌని అశోక్‌గౌడ్, వెంకటాచారి, దేవేందర్‌రెడ్డి, సాధ మల్లారెడ్డి, అంజయ్య, మాదారం రమే్‌షగౌడ్, రాజేందర్‌రెడ్డి, కొంతం జంగారెడ్డి, పల్లె కృష్ణాగౌడ్, వెంకట్‌రెడ్డి, సోమరాజు వెంకటేష్, ఊటు మహేందర్, లింగంయాదవ్, సత్యనారాయణరెడ్డి, సర్పంచ్ అనిత, పాల్గొన్నారు. అనంతరం ధన్నారంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.