శభాష్‌.. పోలీస్‌

ABN , First Publish Date - 2020-03-28T06:06:01+05:30 IST

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కొనసా గుతున్న లాక్‌డౌన్‌ కారణంగా యాచకులకు కష్టాలు మొదలయ్యాయి. ఆకలితో అలమటిస్తున్న వారిపట్ల ఆమనగల్లు పోలీసులు ఔదార్యం...

శభాష్‌.. పోలీస్‌

ఆమనగల్లు : కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కొనసాగుతున్న లాక్‌డౌన్‌ కారణంగా యాచకులకు కష్టాలు మొదలయ్యాయి. ఆకలితో అలమటిస్తున్న వారిపట్ల ఆమనగల్లు పోలీసులు ఔదార్యం చూ పారు. ఆమనగల్లు పట్టణంలో ఉన్న 50 మంది యాచకులకు ప్రతిరోజూ మధ్యాహ్నం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో భోజనం పెట్టాలని పోలీసులు నిర్ణయించారు. ఈమేరకు శుక్రవారం గుర్రంగుట్ట బుడగ జంగాల కాలనీలో ఆమనగల్లు సీఐ కె.నర్సింహారెడ్డి, ఎస్‌ఐ పి.ధర్మేష్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌నాయక్‌, వైస్‌ చైర్మన్‌ దుర్గయ్య, ఎంపీపీ అనితవిజయ్‌, జడ్పీటీసీ అనురాధ పత్యనాయక్‌లతోకలిసి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ యాచకులకు ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 


Updated Date - 2020-03-28T06:06:01+05:30 IST