-
-
Home » Telangana » Rangareddy » Pocharam Muncipal chairman
-
సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి
ABN , First Publish Date - 2020-12-31T05:05:11+05:30 IST
సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి

పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్‌రెడ్డి
ఘట్‌కేసర్ : మున్సిపాలిటీ పరిధిలో సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయనున్నట్లు పోచారం మున్సిపల్ చైర్మ న్ బోయపల్లి కొండల్‌రెడ్డి హామీ ఇచ్చారు. బుధవా రం మున్సిపాలిటీలోని ఐ దు వార్డుల్లో విస్తరించి ఉన్న రాజీవ్ గృహకల్ప కాలనీలో రూ.10 లక్షలతో చేపట్టిన భూగర్భ డ్రైనే జీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలనీలో గతంలో నిర్మించిన భూగర్భ మురుగు కాల్వలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు. దీంతో మురుగునీరు బయటకి పోక జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ మేరకు మున్సిపల్ నిధులతో కొత్త డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కాలనీలో అన్నిచోట్ల మురుగు కాల్వలు కొత్తగా నిర్మిస్తామని వివరించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నానావత్ రెడ్యానాయక్, కమిషనర్ సురేష్, కౌన్సిలర్లు మెట్టు బాల్‌రెడ్డి, సింగిరెడ్డి సాయిరెడ్డి, బాలగోని వెంటేష్, బైర హిమ, ఏఈ నరే్‌షకుమార్ పాల్గొన్నారు.