-
-
Home » Telangana » Rangareddy » Pocharam muncipal chairman
-
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
ABN , First Publish Date - 2020-12-29T04:22:12+05:30 IST
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్‌రెడ్డి
ఘట్‌కేసర్ : పోచారం మున్సిపాలిటీ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్ట ణ పరిఽధిలోని ఇస్మాయిల్‌ఖాన్‌గూడలో రూ.26లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు, రూ.30లక్షలతో నిర్మించనున్న వైకుంఠథామం నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ రెడ్యానాయక్, కమిషనర్ సురేష్, కౌన్సిలర్లు గొంగళ్ల మహేష్, ఏఈ నరే్‌షకుమార్, ఎఫ్‌ఏసీఎస్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి, ఎఫ్‌ఏసీఎస్ మాజీ చైర్మన్ గొంగళ్ల స్వామి, నాయకులు అచ్చిని నర్సింహ, సత్యరెడ్డి, కృష్ణారెడ్డి, శేఖర్, అరవింద్, శ్రీశైలం పాల్గొన్నారు.