-
-
Home » Telangana » Rangareddy » Plants used for medicine should be grown
-
వైద్యానికి ఉపయోగపడే మొక్కలు పెంచాలి
ABN , First Publish Date - 2020-06-23T09:36:29+05:30 IST
అనంతగిరి ప్రాంతంలో వైద్యానికి ఉపయోగపడే మొక్కలు నాటే ప్రయత్నం చేయాలని కలెక్టర్ పౌసుమి బసు అటవీశాఖ అధికారులను ఆదేశించారు.

వికారాబాద్: అనంతగిరి ప్రాంతంలో వైద్యానికి ఉపయోగపడే మొక్కలు నాటే ప్రయత్నం చేయాలని కలెక్టర్ పౌసుమి బసు అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఈనెల 25 నుంచి హరితహారం ప్రారం భించనున్న తరుణంలో సోమవారం అటవీశాఖ అధికారులతో కలిసి ఆమె అనంతగిరిగుట్టను సందర్శించారు. అటవీ ప్రాంతంలో ఏ మొక్కలు నాటితే అవి ఏపుగా పెరిగే అవకాశం ఉందో అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆర్‌అండ్‌బీ విశ్రాంత నూతన భవన నిర్మాణ పనులు పరిశీలించారు. మున్నూరు సోమారం ప్రధాన రహదారికిరువైపులా అనుకూల మైనమొక్కలను నాటాలని ఆదేశించారు. పులుమద్ది పంచాయతీలోని వైకుంఠధామం, డంపింగ్ యార్డులను పరిశీలించారు. వేణుమాధవ్, సుభాషిణి, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.