ఉద్యమస్ఫూర్తితో మొక్కలు నాటాలి

ABN , First Publish Date - 2020-03-02T10:46:55+05:30 IST

పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని ఉద్యమస్ఫూర్తితో చేపట్టాలని జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు కంబాల పరమేశ్‌

ఉద్యమస్ఫూర్తితో మొక్కలు నాటాలి

కడ్తాల్‌: పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని ఉద్యమస్ఫూర్తితో చేపట్టాలని జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు కంబాల పరమేశ్‌ కోరారు. మొక్కల పెంపకంపైనే భావితరాల మనుగడ అధార పడి ఉందన్నారు. కడ్తాల మండల కేంద్రంలో ఆదివారం హరితహారంలో భాగంగా కేపీ యువసేన ఆధ్వర్యంలో మొక్కల పెంపకాన్ని చేపట్టారు. యువజన సంఘాల నాయకులతో కలిసి పలుచోట్ల కంబాల పరమేశ్‌ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కేపీ యువసేన, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-02T10:46:55+05:30 IST