దయచేసి మా ఇంటికి రాకండి!

ABN , First Publish Date - 2020-03-21T05:53:47+05:30 IST

కరోనాను కట్టడి చేసేందుకు ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించే పనిలో నిమగ్నమయ్యారు. దయచేసి ఎవరి ఇంట్లో వారు

దయచేసి మా ఇంటికి రాకండి!

  • కరోనాను కట్టడి చేద్దాం
  • ఇంటి గేటుకు బోర్డు పెట్టిన మాజీ జడ్పీటీసీ మహిపాల్‌రెడ్డి


వికారాబాద్‌, (ఆంధ్రజ్యోతి) : కరోనాను కట్టడి చేసేందుకు ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించే పనిలో నిమగ్నమయ్యారు. దయచేసి ఎవరి ఇంట్లో వారు ఉండండి, మా ఇంటికి కూడా రాకండి అంటూ వికారాబాద్‌ మాజీ జడ్పీటీసీ పట్లోళ్ల మహిపాల్‌రెడ్డి తన ఇంటి మెయిన్‌ గేట్‌కు ప్లకార్డు బిగించారు. తమ ఇంటికి రావద్దని చెబుతున్నందుకు బంధువులు, స్నేహితులు తమను క్షమించాలని విజ్ఞప్తి చేశారు. కరోనాను కట్టడికి ముందస్తు జాగ్రత్తలు తీసుకుని దేశాన్ని కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు. మహిపాల్‌రెడ్డి శుక్రవారం ఇంటి గేట్‌కు కట్టిన ప్లకార్డు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Updated Date - 2020-03-21T05:53:47+05:30 IST