దివ్యాంగులకు ప్రభుత్వం అండ
ABN , First Publish Date - 2020-12-04T04:41:15+05:30 IST
దివ్యాంగులకు ప్రభుత్వం అండ

కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
పలుచోట్ల ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
దౌల్తాబాద్: దివ్యాంగులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కొ డంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పలుచోట్ల జరుపుకున్నారు. దౌల్తాబాద్ మండల కేం ద్రంలో కథాలిక్ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దివ్యాంగులైన పిల్లలకు స్కూల్ బ్యాగులు, వీల్చైర్లను ఎమ్మెల్యే పంపిణీ చేసి, మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నర్సాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం ఆయన భూమి పూజచేశారు. ఆయా చోట్ల ఎంపీపీ విజయ్‌కుమార్, వైస్ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ కోట్ల మహిపాల్‌రెడ్డి, తహసీల్దార్ చాంద్‌పాషా, ఎంపీడీవో తిరుమలస్వామి, నరోత్తంరెడ్డి పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట దివ్యాంగుల నిరసన
వికారాబాద్ : దివ్యాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) జిల్లా అధ్యక్షుడు మాదిగ విజయ్‌కుమార్ కోరారు. గురువారం సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల డిమాండ్లను పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి అనంతరం వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల రాజు, వెంకటయ్య, రామస్వామి, ఉషన్బీ, ఉమ్మెంతల మారత్ పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
దివ్యాంగులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల శాఖ అధికారి లలితకుమారి అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వికారాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా దివ్యాంగులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరయ్యారు. ఈ సందర్భంగా లలితకుమారి మాట్లాడుతూ, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, వీల్చైర్లు, వినికిడి యంత్రాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని తెలిపారు. దివ్యాంగులు ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి సుధాకర్‌షిండే, అదనపు డీఆర్డీవో నర్సిములు, దివ్యాంగుల శాఖ అధికారి యాదగిరి, సిబ్బంది రాజశేఖర్, రమే్‌షకుమార్, లక్ష్మణ్, దివ్యాంగుల యూనియన్ ప్రతినిధులు హాజరయ్యారు.
భవిత కేంద్రాలను వినియోగించుకోవాలి
పరిగి: దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ అరవింద్, ఎంఈవో హరిశ్చందర్ అన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా గురువారం పరిగిలోని ఎమ్మార్సీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు సాధారణ బాలు రుగా ఎదగడానికి భవిత కేంద్రాలు తోడ్పడతాయన్నారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు సురేష్, ఫిజియోథెరపీ డాక్టర్ శివప్రసాద్‌రెడ్డి, ఐఈఆర్పీలు శ్రీదేవి, జ్యోతి, సీఆర్పీలు చంద్రశేఖర్, అనంతవిద్యాసాగర్, మోహన్ పాల్గొన్నారు.
స్నేహపూరిత వాతావరణం కల్పించాలి
పరిగి: దివ్యాంగులకు స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కల్పించాలని పరిగి మున్సిపల్ చైర్మన్ ఎం.అశోక్ అన్నారు. పరిగి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ప్రచంచ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. దివ్యాంగులకు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, వికలాంగులకు ప్రభుత్వం అనేక రాయితీలు, పథకాలు అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో కమిషనర్ ప్రవీణ్, కౌన్సిలర్లు ఎదిరె కృష్ణ, టి.వెంకటేశ్, జె.శ్రీనివాస్, ఎం.శేఖర్, ముజమీల్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇ.కృష్ణ, నాయకులు రియాజ్, రవికుమార్, విలాంగుల సంఘం అధ్యక్షుడు సురేష్,. రంగయ్య పాల్గొన్నారు.