చికిత్స పొందుతూ వ్యక్తిమృతి

ABN , First Publish Date - 2020-03-02T10:42:37+05:30 IST

రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వికారాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన

చికిత్స పొందుతూ వ్యక్తిమృతి

వికారాబాద్‌: రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వికారాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నారాయణపూర్‌ గ్రామానికి చెందిన రాములు (55) శనివారం ఆటోలో వికారబాద్‌ నుంచి తన స్వగ్రామానికి ఆటోలో వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆటో కొత్తగడికి రాగానే ఆటో ముందు భాగంలో కూర్చున్న రాములును పక్కనుంచి వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో రాములు కింద పడిపోయాడు. ప్రమాదంలో అతని రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని వికారాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు అక్కడ ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆదివారం రాములు చికిత్స పొందుతుండగా మృతిచెందాడు. భార్య అంజమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని సీఐ శ్రీనివాస్‌రావు తెలిపారు.

Updated Date - 2020-03-02T10:42:37+05:30 IST