-
-
Home » Telangana » Rangareddy » PEOPLE COMING FROM UP WENT FOR COVID TESTING
-
యూపీ నుంచి వచ్చిన ఏడుగురికి వైద్య పరీక్షలు
ABN , First Publish Date - 2020-03-24T08:17:38+05:30 IST
ఉత్తరప్రదేశ్ నుంచి వ చ్చిన ఏడుగురిని గుర్తించి సోమవారం వా రికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మండలంలోని ప్రతా్‌పసింగారం డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో కార్మికులుగా...

ఘట్‌కేసర్ రూరల్: ఉత్తరప్రదేశ్ నుంచి వ చ్చిన ఏడుగురిని గుర్తించి సోమవారం వా రికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మండలంలోని ప్రతా్‌పసింగారం డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో కార్మికులుగా పనిచేస్తున్న ముగ్గు రు మహిళలు, ఇద్దరు మగవారు, పిల్లలు హోలీ పండుగకు వారి స్వస్థలం యూపీలోని అంత్రా జిల్లాకు వెళ్లి ఆదివారం రాత్రి వచ్చా రు. వీరిని గమనించిన స్థానికులు సర్పంచు శివశంకర్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన ఏఎన్‌ఎం, అశావర్కర్‌తో కలిసి వారి వద్దకు చేరుకొని వివరాలు తీసుకున్నారు.
వారు ఎలా వచ్చారు? ఎప్పుడు వచ్చారు? ఎవరిని కలిశారనే విషయాలను అడిగితెలుసుకున్నా రు. తాము ఉత్తరప్రదేశ్ నుండి రైలులో వ చ్చామని సికింద్రాబాద్‌లో దిగి అక్కడి నుండి నడుచుకుంటూ వచ్చినట్లు వారు తెలిపారు. దీంతో సిబ్బంది వారికి వైద్య పరీక్షలు జరిపి మీరు ఎక్కడికి వెళ్లొదని, ఒకవేళ వెళ్లిన త మకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సర్పంచు పంచాయతీ సిబ్బందితో డబుల్‌బెడ్‌రూంల నిర్మాణం పరిసరాల్లో బ్లీచింగ్ చల్లి ంచారు. కరోనా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో తగి న జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి నరేష్, వార్డుసభ్యుడు సుధాకర్, ఏఎన్‌ఎం సునంద తదితరులు పాల్గొన్నారు.
అవుశాపూర్‌లో... మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రా నుంచి వచ్చిన కార్మికులను గుర్తించి ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి ఏఎన్‌ఎంకు సమాచారం అంది ంచారు. దీంతో వైద్య సిబ్బంది వచ్చి కార్మికులకు పరీక్షలు నిర్వహించారు. కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలని వారికి తెలిపారు.