రేషన్‌ బియ్యం అక్రమార్కుడిపై పీడీ యాక్ట్‌

ABN , First Publish Date - 2020-03-25T12:09:45+05:30 IST

తాండూరులో రేషన్‌దారుల నుంచి ప్రభుత్వం సరఫరా చేసే బియ్యాన్ని కొనుగోలు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని కరన్‌కోట్‌ పోలీసులు పట్టుకుని...

రేషన్‌ బియ్యం అక్రమార్కుడిపై పీడీ యాక్ట్‌

తాండూరు రూరల్‌: తాండూరులో రేషన్‌దారుల నుంచి ప్రభుత్వం సరఫరా చేసే బియ్యాన్ని కొనుగోలు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని కరన్‌కోట్‌ పోలీసులు పట్టుకుని పీడీయాక్ట్‌ కేసు నమోదు చేశారు. నిందితుడిని మంగళవారం చర్లపల్లి జైలుకు తరలించారు. తాండూరు రూరల్‌ సీఐ జలంధర్‌రెడ్డి, కరన్‌కోట్‌ ఎస్సై సంతోష్‌కుమార్‌లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం చెంగోల్‌ గ్రామానికి చెందిన వడ్డె వెంకటయ్య  ఆరు నెలలుగా తాండూరులోని రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి దొంగచాటుగా విక్రయిస్తుంటాడు. అక్టోబర్‌లో గౌతాపూర్‌ సమీపంలోని శ్రీనివాస్‌నగర్‌ కాలనీ వద్ద ఓ ఇంట్లో అక్రమంగా బియ్యం విక్రయిస్తుండగా నిందితునిపై అప్పట్లో కేసు నమోదు చేసిపట్లు సీఐ తెలిపారు. వెంకటయ్య తిరిగి రెండోసారి బియ్యం విక్రయిస్తుండగా, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశామని తెలిపారు. మరోసారి బియ్యం విక్రయిస్తుండగా జిల్లా కలెక్టర్‌, ఎస్పీల ఆదేశాల మేరకు వెంకటయ్యపై పీడీ యాక్ట్‌ నమోదు చేసి నేరుగా చర్లపల్లి జైలుకు తరలించామన్నారు.

Read more