29వ తేదీ వరకు పత్తి కొనుగోళ్లు నిలిపివేత

ABN , First Publish Date - 2020-11-27T04:32:34+05:30 IST

29వ తేదీ వరకు పత్తి కొనుగోళ్లు నిలిపివేత

29వ తేదీ వరకు పత్తి కొనుగోళ్లు నిలిపివేత

ఆమనగల్లు : ఆమనగల్లు మార్కెట్‌ యార్డ్‌ పరిధిలోని తలకొండపల్లి శ్రీనివాస మురుగన్‌ జన్నింగ్‌ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో చేస్తున్న పత్తి కొనుగోళ్లు గురువారం నుంచి ఆదివారం వరకు నిలిపివేస్తున్నట్లు మార్కెట్‌ యార్డ్‌ కార్యదర్శి శ్రీశైలం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మిల్లులో పత్తి నిల్వలు పేరుకుపోవడం, స్థలం లేకపోవడం, తుఫాన్‌ కారణంగా నాలుగు రోజుల పాటు కొనుగోళ్లు నిలిపివేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి యథావిధిగా కొనుగోళ్లు ప్రారంభిస్తామని తెలిపారు. ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల, తలకొండపల్లి మండలాల రైతులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని శ్రీశైలం కోరారు. 

Updated Date - 2020-11-27T04:32:34+05:30 IST