-
-
Home » Telangana » Rangareddy » parigi dovolopment
-
పరిగి శాశ్వత అభివృద్ధికి చర్యలు
ABN , First Publish Date - 2020-12-11T03:53:50+05:30 IST
పరిగి శాశ్వత అభివృద్ధికి చర్యలు

ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
పరిగి: పరిగి నియోజకవర్గ శాశ్వత అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. పరిగి పట్టణ పరిధిలోని 11వ వార్డులో గురువారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిగి మున్సిపల్ పరిధిలోని రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇవికాకుండా మరో రూ.3 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని, ఎన్ని నిధులైనా తేవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎం.అశోక్, కౌన్సిలర్లు ఎదిరె కృష్ణ, టి.వెంకటేశ్; వార్ల రవీంద్ర, నాగేశ్, ఎం.శేఖర్, కమిషనర్ ప్రవీణ్, నాయకులు కల్లు శ్రీనివా్‌సరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, గోపాల్, మల్లెశ్, రియాజ్, మౌలనా పాల్గొన్నారు.