పక్కాగా చేయాలి.. జాతీయ ఉపాధిహామీ పనుల పరిశీలన
ABN , First Publish Date - 2020-12-11T05:42:28+05:30 IST
ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలుచేసేందుకు యం త్రాంగం ప్రణాళికాబద్ధ్దంగా ముందుకు సాగాలని కేంద్రగ్రామీణాభి వృద్ధిశాఖ జాయింట్ సెక్రటరీ రోహిత్‌కుమార్ పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖలకు చెందిన కేంద్ర అధికారుల బృందం గురువారం మంచాల మండలంలో పర్యటించింది.
గ్రామీణాభివృద్ధిశాఖ జాయింట్ సెక్రటరీ రోహిత్‌కుమార్
మంచాల మండలంలో కేంద్ర పంచాయతీరాజ్ బృందం పర్యటన
మంచాల: ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలుచేసేందుకు యం త్రాంగం ప్రణాళికాబద్ధ్దంగా ముందుకు సాగాలని కేంద్రగ్రామీణాభి వృద్ధిశాఖ జాయింట్ సెక్రటరీ రోహిత్‌కుమార్ పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖలకు చెందిన కేంద్ర అధికారుల బృందం గురువారం మంచాల మండలంలో పర్యటించింది. ఈ సందర్భంగా రోహిత్‌కుమార్, జాయింట్ డైరెక్టర్ అమరేంద్రప్రతా్‌పసింగ్, కిరన్‌పాతె, రాష్ట్రగ్రామీణ, పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ రఘునందన్‌రావు, కలెక్టర్ అమయ్‌కుమార్‌లతో కూడిన బృందం సభ్యులు లోయపల్లి, ఆరుట్ల గ్రామాలను సందర్శించారు. ఉపాధిపథకం కింద లోయపల్లి దిగువన చేపట్టిన ఫారంపాండ్, వర్మికంపోస్టు షెడ్‌ను పరిశీలించారు. ఆరుట్లలో పల్లెప్రకృతివనాలు, వైకుంఠధామాలను సందర్శించి మొక్కలు నాటారు.
అనంతరం రైతు మల్లయ్యకు చెందిన జామతోటను పరిశీలించి ఈజీఎస్ ద్వారా అందిస్తున్న ప్రోత్సాహకాలను అడిగి తెలుసుకున్నారు. కూలీలు, మేట్లు, ఈజీఎస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. పనులు నాణ్యంగా ఉన్నాయకి, ఇవి దీర్ఘకాలంపాటు ప్రయోజనకరంగా ఉంటాయని జిల్లాయంత్రాంగాన్ని అభినందించారు. డ్రాగన్‌ఫ్రూట్‌తోటల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ కమిషనర్లు బి.సైదులు, ప్రసాద్, జాయింట్ కమిషనర్ జగన్‌కుమార్‌రెడ్డి, జాయింట్ కలెకర్లు సతీ్‌షజైన్, హరీష్, డీఆర్‌డీవో రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీపీ జాటోత్‌నర్మద, జడ్పీటీసీ మర్రినిత్యనిరంజన్‌రెడ్డి, సర్పంచులు ఎల్లంకి అనిత, కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి, ఉపసర్పంచ్ జంగయ్య పాల్గొన్నారు.