ఓపెన్‌ ఇంటర్‌, టెన్త్‌ అడ్మిషన్‌

ABN , First Publish Date - 2020-12-11T05:05:19+05:30 IST

ఓపెన్‌ ఇంటర్‌, టెన్త్‌ అడ్మిషన్‌

ఓపెన్‌ ఇంటర్‌, టెన్త్‌ అడ్మిషన్‌

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): 2020-21 విద్యా సంవత్సరానికి తెలంగాణ సార్వత్రిక విద్య పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల చేశామని జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి గురువారం తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 10వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు అడ్మిషన్‌ పొందవచ్చన్నారు. అపరాధ రుసుముతో జనవరి 6 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్‌, పదో తరగతిలో ప్రవేశం పొందవచ్చు. దరఖాస్తు ఫారం ఓపెన్‌ స్కూల్‌ స్టడీ సెంటర్‌, తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం వెబ్‌సైట్‌ ద్వారా పొంది, ఆలైన్‌ద్వారా ప్రవేశ ఫీజు చెల్లించచ్చని వివరించారు.


  • ఫీజు వివరాలు 

- పదో తరగతిలో అడ్మిషన్‌కు ఓసీ(పురుషులకు) రూ.1,100

- ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు/మహిళలు : రూ.700

- ఇంటర్మీడియట్‌ అడ్మిషన్‌ కోసం ఓసీ(పురుషులకు) రూ.1300

- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు/మహిళలు : 1000

లేటు ఫీజు పదో తరగతికి రూ.100, ఇంటర్‌కు రూ.200 ఉంటుందన్నారు. ఇతర వివరాలకు దగ్గరలోని ఓపెన్‌ స్కూల్‌ స్టడీ సెంటర్‌ను సంప్రదించాలని లేదా కేవీ.సత్యనారాయణ(ఫోన్‌ నెం:8008403515) సంప్రదించాలని కోరారు. 

Updated Date - 2020-12-11T05:05:19+05:30 IST