లక్ష డబుల్‌బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేయాలి

ABN , First Publish Date - 2020-09-24T06:35:42+05:30 IST

పేదలకు వెంటనే లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేయాలని, ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ

లక్ష డబుల్‌బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేయాలి

మేడ్చల్‌, రంగారెడ్డి కలెక్టరేట్ల వద్ద బీజేపీ ధర్నా.. ఉద్రిక్తం 

ఎల్‌ఆర్‌ఎస్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ 

కలెక్టరేట్లలోకి చొచ్చుకెళ్లేందుకు నేతల యత్నం, పలువురు అరెస్టు 


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి): పేదలకు వెంటనే లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేయాలని, ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం మేడ్చల్‌జిల్లా కలెక్టరేట్‌ వద్ద బీజేపీ నాయకులు ధర్నా చేపట్టింది. బీజేపీ శ్రేణులు ప్లకార్డులు చేతపట్టుకుని కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ముళ్లకంచెను దాటుకుని  కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రధాన గేటు వద్ద ఉన్న పోలీసు బలగాలు ఆందోళనకారులను అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్‌ డౌన్‌డౌన్‌.. అంటూ నినాదాలతో హోరెత్తిం చారు. పోలీసులు, ఆందోళనకారుల తోపులాటలో కలెక్టర్‌ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నది. ధర్నా చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి  కీసర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కలెక్టరేట్‌ వద్ద ధర్నా సమాచారం పోలీసులకు తెలియడంతో బీజేపీ మేడ్చల్‌ అర్బన్‌ కమిటీ అధ్యక్షుడు పన్నాల హరీష్‌రెడ్డితోపాటు మేడ్చల్‌జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరం కాంతారావు, తదితరులను పోలీసులు బుధవారం ఉదయం హౌజ్‌ అరెస్టు చేశారు.


ఈ సందర్భంగా బీజేపీ రూరల్‌ కమిటీ అధ్యక్షుడు పట్లోళ్ల విక్రంరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని, చిత్తశుద్ధి ఉంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల కంటే ముందుగానే పేదలకు లక్ష డబుల్‌బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమ యంలో కేసీఆర్‌ ప్రజలకు మోసపూరిత వాగ్దా నాలు చేయడం, రెచ్చగొట్టే మాటలు మాట్లాడి పబ్బం గడుతుపున్నారని ఆరోపించారు. ఎల్‌ ఆర్‌ఎస్‌ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు ఎంతో కష్టపడి కొనుగోలు చేసుకున్న ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకోవాలని కటాఫ్‌ తేదీని నిర్ణయించి, కరోనా సమయంలో ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు పెద్దఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్య క్షుడు కొంపల్లి మోహన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, రాష్ట్ర యువజన మోర్చా అధ్యక్షుడు భానుప్రకాష్‌, కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జిల్లాల తిరుమల్‌రెడ్డి పాల్గొన్నారు. 


రంగారెడ్డి కలెక్టరేట్‌ వద్ద..

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఎల్‌ఆర్‌ ఎస్‌ను వెంటనే రద్దు చేయాలని దళితమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా డిమాండ్‌ చేశారు. బుధవారం రంగారెడ్డి కలెక్టరేట్‌ వద్ద బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా ఉధృతంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. బలవంతంగా నేతలను పోలీసు వాహనాల్లోకి ఎక్కించి సమీపంలోని పోలీస్టేషన్లకు తరలిం చారు.  ధర్నాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి,  బీజేపీ జిల్లా అర్బన్‌ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, రాష్ట్ర నాయకులు అంజన్‌ కుమార్‌గౌడ్‌, నాయకులు పాపయ్యగౌడ్‌, కొలన్‌ శంకర్‌రెడ్డి, మిద్దె సుదర్శన్‌రెడ్డి, పొరెడ్డి అర్జున్‌రెడ్డి, వేపల్లి అశోక్‌గౌడ్‌, బోసుపల్లి ప్రతాప్‌, చింతల నందకిషోర్‌, కాసుల వెంకటేష్‌, తేరేటి లక్ష్మణ్‌ ముదిరాజ్‌, పొట్టి రాములు, వనపల్లి శ్రీనివాస్‌రెడ్డి, లచ్చిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-24T06:35:42+05:30 IST