అవగాహన ఏది?

ABN , First Publish Date - 2020-03-28T06:52:20+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం పాటించాలని వైద్యులు చెబుతున్నారు. కానీ చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌ పల్లి, మొయినాబాద్‌ మండలాల...

అవగాహన ఏది?

  • సామాజిక దూరం పాటించని అధికారులు, ప్రజాప్రతినిధులు

చేవెళ్ల : కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం పాటించాలని వైద్యులు చెబుతున్నారు. కానీ చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌ పల్లి, మొయినాబాద్‌ మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు మా త్రం ఈ విషయాన్ని మరిచిపోతున్నారు. కరోనాపై ప్రజలకు అవ గాహన కల్పించడానికి బయటకు వస్తున్న వీరు ఎవరికి వారు ఇష్టానుసారం ప్రజలతో కలిసిపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. శుక్రవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మాస్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు ఎవరూ సామాజికదూరం పాటించినట్లు కన్పించలేదు. ఇక్కడే కాకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కూడా ఇదే తంతు అని ప్రజలు మండిపడుతున్నారు. 

Updated Date - 2020-03-28T06:52:20+05:30 IST