జీవాలకు నట్టల నివారణ మందులు వాడాలి
ABN , First Publish Date - 2020-12-05T05:49:17+05:30 IST
జీవాలకు నట్టల నివారణ మందులు వాడాలి

ఘట్కేసర్ రూరల్/కీసర: గొర్రెల కాపరులు జీవాలకు నట్టల నివారణ మందులను వాడాలని అంకుశాపూర్ ఎంపీటీసీ శోభారాణి, ఉపసర్పంచ్ కృష్ణగౌడ్‌లు అన్నారు. మండలంలోని అంకుశాపూర్, ఎదులాబాద్ గ్రామాల్లో శుక్రవారం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జీవాలకు ఉచితంగా నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాడి రైతులు పశువైద్యుల సలహాలు సూచనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి పద్మిని, వార్డుసభ్యుడు బుచ్చిరెడ్డి, పశువైద్యసిబ్బంది భూషణ్కులకర్ణి, శోభారాణి, గణేష్, నాయకులు దామోదర్‌రెడ్డి, గొర్రెకాపారులు మల్లేష్, శ్రీశైలం, దానయ్య, బాలయ్య పాల్గొన్నారు. కీసర మండల పరిధి కీసర, భోగారం గ్రామాలల్లో కీసర, భోగారం సర్పంచులు మాధురి, కవిత మూగజీవాలకు నట్టల నివారణ టీకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచులు బాలామణీ, జానకీరామ్, ఎంపీటీసీ తటాకం నారాయణ శర్మ, మండల పశు వైద్యాధికారి శ్యామల, జూనియర్ వెటర్నరీ వైద్యుడు ప్రవీణ్‌లతో పాటు వార్డుసభ్యులు పలువురు పాల్గొన్నారు.