ప్రజల్లో అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2020-11-26T06:03:24+05:30 IST

ప్రజల్లో అవగాహన కల్పించాలి

ప్రజల్లో అవగాహన కల్పించాలి
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌

శామీర్‌పేట: తడి, పొడి చెత్తను వేరువేరుగా వేసేలా పారిశుధ్య సిబ్బంది  ప్రజల్లో అవగాహన కల్పించాలని మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ శ్రావణ్‌కుమార్‌ సూచించారు. బుధవారం శామీర్‌పేట మండలం తూం కుంట మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛసర్వేక్షణ్‌ 2020-21పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు. మున్సిపల్‌ పరిధిలో ఎక్కడ కూడా బహిరంగ మల విసర్జన జరుగకుండా చూడాలని ఆయన సిబ్బందికి చెప్పారు. అలాగే ప్రభుత్వ నిబంధనల మేరకు మున్సిపల్‌ పరిధిలో హరితహారం, నర్సరీ మొక్కల పెంపకాన్ని, సంరక్షణ చర్యలను బాధ్యతగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఆర్‌ఐ గోపాల్‌రెడ్డి, పర్యావరణ ఇంజనీరు గణేష్‌, శానిటేషన్‌, హరితహారం సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-26T06:03:24+05:30 IST