‘పుర’ పురస్కారాలు

ABN , First Publish Date - 2020-12-07T04:40:41+05:30 IST

పురపాలిక సంఘాల్లో లక్ష్యాలను సాధించిన పట్టణాలకు పట్టణ ప్రగతి పురస్కారాలు-2020ని ప్రవేశపెట్టారు.

‘పుర’ పురస్కారాలు

  • పట్టణ ప్రగతి పేరిట పట్టణాలకు ప్రోత్సాహం
  • 14 అంశాల ప్రామాణికంగా 500 మార్కులు
  • నాలుగు విభాగాలుగా పోటీ


తాండూరు : పురపాలిక సంఘాల్లో లక్ష్యాలను సాధించిన పట్టణాలకు పట్టణ ప్రగతి పురస్కారాలు-2020ని ప్రవేశపెట్టారు. పట్టణ ప్రగతి కార్యక్రమాలు అమలులో విశేష ప్రతిభ కనబరిచిన పట్టణాలను ప్రోత్సహించడానికి పురస్కారాలను ఇవ్వనున్నారు. దీంతో పురపాలిక సంఘాల్లో పోటీతత్వం పెరిగి లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంటుంది. పట్టణాల్లో జీవనోపాధి మెరుగు పరుచుటకు పేదలు, మహిళల నిర్దిష్ట అవసరాలపై దృష్టి, ఉత్తమమైన పౌర సేవల నిర్వహణ వంటి భాగాల్లో ప్రజల భాగస్వామ్య, వినూత్నమైన నమూనాలను గుర్తించి పురస్కారాలు అందిస్తారు. 14అంశాలు, 58 రకాల వివరాల ఆధారంగా 500 మార్కులుగా అవార్డు పొందేందుకు వర్గీకరించారు. ఫిబ్రవరి 2021లో ఈ అవార్డులను అందజేయనున్నారు. పట్టణ ప్రగతి చేపట్టే పనులను అనుసరించి పురస్కారాలు అందించనున్నారు. ఇందుకు రాష్ట్రంలోని 120 పైగా మున్సిపాలిటీలను జనాభా ప్రాతిపదికన నాలుగు సెగ్మెంట్లుగా విభజించారు. వాటికి అవార్డులు ఇచ్చేలా కార్యచరణ చేపట్టనున్నారు. మొదటి విభాగంలో 25వేలు జనాభా ఉన్న మున్సిపాలిటీ, రెండో విభాగంలో 25వేల నుంచి 55వేల జనాభా, మూడో సెగ్మెంట్‌లో 50వేల నుంచి లక్ష జనాభా, నాలుగో విభాగంలో లక్ష నుంచి 3 లక్షల జనాభాలోపు ఉన్న మున్సిపాలిటీలను ఎంపిక చేయనున్నారు.  


అంశాలిలా..

హరితహారం, వైకుఠధామం, పబ్లిక్‌ టాయిలెట్స్‌, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, సాలిడ్‌వెస్ట్‌ సేకరణ, తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించడం, సాలిడ్‌ వేస్ట్‌ ప్రాసెసింగ్‌, వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం, మోడల్‌ మున్సిపాలిటీ, ప్రకృతి వనం(పార్కులు), ఆన్‌లైన్‌ సర్వీసెస్‌, కనీస అవసరాలైన శానిటేషన్‌, వీధి దీపాలు, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, వందశాతం ఆస్తిపన్ను వసూలు, గ్రీన్‌బడ్జెట్‌, ప్ర జల భాగస్వామ్యం వంటి అంశాలకు ప్రాధాన్యమివ్వనున్నారు. 


ప్రతినెలా నిధులు మంజూరు

పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మార్పు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో సైతం పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-12-07T04:40:41+05:30 IST