-
-
Home » Telangana » Rangareddy » mumbai returned man quarantined inhouse
-
ముంబై నుంచి వచ్చిన యువకుడి ఇంటికి క్వారంటైన్ స్టిక్కర్
ABN , First Publish Date - 2020-03-24T07:53:54+05:30 IST
షాద్‌నగర్ విజయ నగర్ కాలనీలోని ఓ ఇంటికి వైద్య సిబ్బంది క్వారంటైన్ (గృహనిర్బంధ) స్టిక్కర్‌ను అతికించారు. వివరాల్లోకి వెళితే...

షాద్‌నగర్: షాద్‌నగర్ విజయ నగర్ కాలనీలోని ఓ ఇంటికి వైద్య సిబ్బంది క్వారంటైన్ (గృహనిర్బంధ) స్టిక్కర్‌ను అతికించారు. వివరాల్లోకి వెళితే... కాలనీకి చెందిన ఓ యువ కుడు ఈనెల 8న దుబాయ్ నుంచి రావడం జరిగింది. అయితే శంషా బాద్ ఎయిర్‌పోర్ట్‌లో అతన్ని పరీక్షిం చిన వైద్యులు కరోనా లక్షణాలు లేనట్లు నిర్ధారించి ఇంటికి పంపించారు. కాగా ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని కట్టడి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి ఇంటికి స్టిక్కర్ అంటిం చడం జరిగిందని హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు తెలిపారు. ఆ ఇంట్లో నలు గురు కుటుంబ సభ్యులు ఉంటున్నారని, వారికి కూడా పరీక్షలు నిర్వహించామని, ఎలాంటి కరోనా లక్షణాలు కానరాలేదని తెలిపారు. 14రోజులపాటు ఎవరూ కూడా ఆ ఇంటికి వెళ్లరాదని, ఆ ఇంట్లో నివసిస్తున్న వ్యక్తులు కూడా ఇతరులను కలవ రాదని శ్రీనివాసులు వివరించారు.