ప్రజల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యం

ABN , First Publish Date - 2020-09-12T10:06:00+05:30 IST

ప్రజల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా రా ష్ట్ర ప్రభుత్వం పథకాలు రూ పొందించి అమలు చేస్తుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

ప్రజల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యం

ఎమ్మెల్సీ కసిరెడ్డి


ఆమనగల్లు : ప్రజల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా రా ష్ట్ర ప్రభుత్వం పథకాలు రూ పొందించి అమలు చేస్తుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్లు, కడ్తాల్‌, వెల్దండ మండలాలకు చెందిన పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహయనిధి ద్వారా మంజూరైన చెక్కులను శుక్రవారం నగరంలోని తన నివాసంలో ఎమ్మెల్సీ అందచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నా ప్రజా శ్రేయస్సు దృష్ట్యా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రభుత్వం యథావిధిగా కొనసాగిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆమనగల్లు ఎంపీపీ అనితావిజయ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, కృష్ణ, విజయ్‌ రాథోడ్‌, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-12T10:06:00+05:30 IST