దేశానికే తెలంగాణ ఆదర్శం

ABN , First Publish Date - 2020-12-11T05:02:49+05:30 IST

దేశానికే తెలంగాణ ఆదర్శం

దేశానికే తెలంగాణ ఆదర్శం
చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్సీ నారాయణరెడ్డి

  • ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు : పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.  ప్రజారోగ్య పరిరక్షణ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.  ఆమనగల్లు, వెల్దండ, కడ్తాల, తలకొండపల్లి మండలాలకు చెందిన అంతమ్మకు రూ.12వేలు, సిద్దార్థకు రూ.9500, అమృతకు రూ.39,500, లక్ష్మికి రూ.12వేలు, జస్వంత్‌కు రూ.16వేలు ముఖ్యమం త్రి సహాయనిధి ద్వారా మంజూరయ్యాయి. గురువారం నగరంలోని తన నివాసంలో బాధిత కుటుంబాలకు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంగా నిలుస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీలు కమ్లిమోత్యనాయక్‌, అనితవిజయ్‌, నాయకులు జిల్లెల రాములు, శంకర్‌, శేషన్‌, సుమన్‌, మల్లేశ్‌, రవి, వెంకట్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  


వివాహ వేడుకలో పాల్గొన్న ప్రముఖులు


టీఆర్‌ఎస్‌ యువజన విభాగం జిల్లా నాయకుడు టి.చంద్రశేఖర్‌రెడ్డి వివాహ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివా్‌సరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివా్‌సయాదవ్‌, మండల అధ్యక్షుడు నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, గట్టిప్పలపల్లి సర్పంచ్‌ జయమ్మ వెంకటయ్య, నాయకులు పాల్గొని వధూవరులు చందన, చంద్రశేఖర్‌రెడ్డిలను ఆశీర్వదించారు. అదే విధంగా తలకొండపల్లి మండలం గట్టిప్పలపల్లి, వెంకట్రావుపేట గ్రామాల్లో జరిగిన వివాహ వేడుకల్లో ఎమ్మెల్సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-11T05:02:49+05:30 IST