మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ

ABN , First Publish Date - 2020-11-28T05:17:41+05:30 IST

మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ

మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ నారాయణరెడ్డి

ఆమనగల్లు : మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధికి బీజేపీ యత్నిస్తోందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆరోపించారు. ఆమనగల్లులో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చేస్తున్నదెవరో... అడ్డుపడుతున్నదెవరో ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు. వరదల కారణంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేపీ నేతలు కనీసం పరామర్శకు కూడా రాలేదని మండిపడ్డారు. తెలంగాణకు నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు. హైద్రాబాద్‌లో రోహింగ్యాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం, హోం శాఖ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బీజేపీ అసత్య ప్రచారాలను ప్రజలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎ్‌సతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. సమావేశంలో ఆమనగల్లు, కడ్తాల్‌ ఎంపీపీలు అనితవిజయ్‌, కమ్లీమోత్యనాయక్‌, వైస్‌ ఎంపీపీ ఆనంద్‌, నాయకులు జిల్లెల్ల రాములు, శ్రీనివా్‌సరెడ్డి, శంకర్‌నాయక్‌, రవీందర్‌, సురేందర్‌రెడ్డి, నర్సింహ పాల్గొన్నారు. 

Read more