‘మైసిగండి’ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం
ABN , First Publish Date - 2020-12-18T04:19:17+05:30 IST
‘మైసిగండి’ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం

ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్
కడ్తాల్ : మైసిగండి మైసమ్మ దేవస్థానాన్ని మరింత అబివృద్ధి చేసి ప్రముఖ పుణ్యక్షేత్రంగా, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్ హామీ ఇచ్చారు. పురాతన ఆలయాల పునరుద్ధరణకు, దైవ కార్యక్రమాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఆయన తెలిపారు. కడ్తాల మండలం మైసిగండి మైసమ్మ ఆలయాన్ని గురువారం ఎమ్మెల్యే సందర్శించారు. ఆలయ ఫౌండర్ ట్రస్టీ రామావత్ సిరోలి పంతు, ఈవో స్నేహలత, సర్పంచ్ రామావత్ తులసీరామ్ నాయక్, అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయం వద్ద భక్తులకు మరిన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. ఆలయ అభివృద్ధికి దాతలు చేయూతనందించాలని కోరారు. కార్యక్రమంలో ఆమనగల్లు సింగిల్‌విండో చైర్మన్ గంపా వెంకటేశ్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, వెల్దండ జడ్పీటీసీ విజితారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు జోగు వీరయ్య, టీఆర్‌ఎస్ తలకొండపల్లి మండల అధ్యక్షుడు నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, కడ్తాల ఉపసర్పంచ్ కడారి రామకృష్ణ, సీఐ ఉపేందర్, కడ్తాల ఎస్‌ఐ సుందరయ్య, నాయకులు శ్రీరాములు, యాదగిరి, రమావత్ భాస్కర్, ఈర్ష్యద్, జంగ య్య, గోపాల్, సంతోష్, నరేందర్ నాయక్ పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ఆమనగల్లు : సీఎంఆర్‌ఎఫ్ పథకం నిరుపేదలకు వరంగా మా రిందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను గురువారం నగరంలోని తన నివాసంలో ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఆమనగల్లు వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, మాడ్గుల సర్పంచ్ జంగయ్యగౌడ్, నాయకులు రాజవర్ధన్‌రెడ్డి, నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, బాలేమియా, నరేందర్ పాల్గొన్నారు.
మృతుని కుటుంబానికి పరామర్శ
ఆమనగల్లు మున్సిపాలిటీకి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు కాసోజు రాము తండ్రి పాపయ్య అనారోగ్యంతో మృతిచెందాడు. గురువారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మృతికి సంతాపం తెలిపి, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇంకా జడ్పీటీసీలు అనురాధాపత్యానాయక్, విజితారెడ్డి, నాయకులు అప్పం శ్రీనివాస్, నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, రూపం వెంకట్‌రెడ్డి, సోని జయరాం, సయ్యద్ ఖలీల్, వెంకటయ్య, రాములు, నరేందర్‌నాయక్, కిరణ్, వెంకటేశ్, గణేష్ ఉన్నారు.