స్వచ్ఛత కోసం కృషి చేద్దాం

ABN , First Publish Date - 2020-10-03T09:35:13+05:30 IST

ప్రతీ ఒక్కరూ స్వచ్ఛత కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే పట్నంనరేందర్‌రెడ్డి అన్నారు.

స్వచ్ఛత కోసం కృషి చేద్దాం

ఎమ్మెల్యే పట్నంనరేందర్‌రెడ్డి


కొడంగల్‌: ప్రతీ ఒక్కరూ స్వచ్ఛత కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే పట్నంనరేందర్‌రెడ్డి అన్నారు. స్వచ్ఛాభారత్‌లో భాగంగా కొడంగల్‌ ప్రభుత్వాసుపత్రి ఆవరణలో నిర్మించిన ప్రజా మరుగుదొడ్లను శుక్రవారం ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్మెన్‌ జగదీశ్వర్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సీలర్‌లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 


పారిశుధ్యానికే ప్రథమ ప్రాధాన్యం

వికారాబాద్‌: పారిశుధ్యానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌ అన్నారు. శుక్రవారం వికారాబాద్‌  మునిసిపల్‌ పరిధిలోని అనంతగిరి రోడ్డులో పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయ సమీపంలో నూతనంగా నిర్మించిన పబ్లిక్‌ టాయిలెట్స్‌ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరమేష్‌, వైస్‌చైర్మన్‌ శంషాద్‌బేగం, పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, మునిసిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి, హఫీజ్‌, రమేష్‌, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T09:35:13+05:30 IST