అభివృద్ధిపై దృష్టి సారిస్తాం... పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-12-10T05:42:48+05:30 IST

అభివృద్ధిపై దృష్టి సారిస్తాం... పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి

అభివృద్ధిపై దృష్టి సారిస్తాం... పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి
రాఘవాపూర్‌లో జీపీ భవనానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే

  • కుల్కచర్ల మండల పరిషత్‌ సమావేశం

కులకచర్ల: ఎన్నికలన్నీ ముగిశాయని, ఇక ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారిస్తుందని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ బి.మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. పలు అంశాలపై అధికారులను సభ్యులు నిలదీశారు. మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌లు పగిలి రోడ్లపై నీరు పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని సర్పంచ్‌లు తెలిపారు. విద్యుత్‌ తీగలు కిందికి వేలాడుతూ ప్రమాదకరంగా మారినా ట్రాన్స్‌కో సిబ్బంది పట్టించుకోవడం లేదన్నారు. ట్రాన్స్‌కో అధికారులు చౌడాపూర్‌, వీరాపూర్‌ దారిలో వేలాడుతున్న వైర్లను సరిచేయడం లేదని వీరాపూర్‌ సర్పంచ్‌ జనార్దన్‌రెడ్డి తెలిపారు. రైతులు తమ భూములు సర్వేకు ఫీజులు చెల్లించి నెలలు గడుస్తున్నా అధికారులు సరే ్వ చేయడం లేదని ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తెలిపారు. రోగాల బారిన పడిన పశువులను ఆసుపత్రికి తీసుకొస్తే మందులు లేవని బయటకు రాస్తున్నారని సభ్యులు తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ అఽధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్‌ తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాందా్‌సనాయక్‌, వైస్‌ ఎంపీపీ రాజశేఖర్‌గౌడ్‌, పీఆర్‌ డీఈ ఉమేశ్‌కుమార్‌, ఎంపీడీవో కాల్‌సింగ్‌, ఎంపీవో సుందర్‌, డీటీ శ్రీనివా్‌సరావు, రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్‌ పీరంపల్లి రాజు, తదితరులు పాల్గొన్నారు.


కేసీఆర్‌ పథకాలు దేశానికే ఆదర్శం

పరిగి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా ఉంటున్నాయని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం పరిగిలోని తనివాసంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం రూ.1,00,116 అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కె.శ్యాంసుందర్‌రెడ్డి, జడ్పీటీసీ బి.హరిప్రియ, ఎంపీపీ అరవింద్‌రావు, నార్మాక్స్‌ మాజీ డైరెక్టర్‌ ప్రవీణ్‌రెడ్డి, టి.వెంకటేశ్‌, గోపాల్‌ పాల్గొన్నారు.


అన్ని కొత్త పంచాయతీలకు భవనాలు 

కొత్తగా ఏర్పడిన అన్ని పంచాయతీలకు భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తెలిపారు. రాఘవాపూర్‌లో పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతీ గ్రామంలో పంచాయతీ భవనం, క్రిమిటోరియం, డంపింగ్‌యార్డు, పల్లెప్రకృతి వనాల ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలకు నిధుల కొరత లేదన్నారు. కార్యక్రమంలో పీఏసీఎ్‌స వైఎస్‌చైర్మన్‌ భాస్కర్‌, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, సర్పంచ్‌ జగన్‌, ఎం పీటీసీ బి.ఉమాదేవి, ప్రవీణ్‌రెడ్డి, పి.హన్మంత్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-10T05:42:48+05:30 IST