-
-
Home » Telangana » Rangareddy » MLA dovelopment programs
-
టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది ప్రజామోద పాలన
ABN , First Publish Date - 2020-12-16T05:03:14+05:30 IST
టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది ప్రజామోద పాలన

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్
శంషాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందిస్తోందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్ అన్నారు. శంషాబాద్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీవరేజ్ మిషన్‌తో పాటు పారిశుధ్యం సేకరణ వాహనాలను మున్సిపల్ చైర్‌పర్సన్ సుష్మాతో కలసి ఎమ్మెల్యే మంగళవారం ప్రారంభించారు. మహవీర్ బిల్డర్స్‌లో ఏర్పాటు చేసిన ఉచిత మరుగుదొడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పేర్కొన్న పనులతో పాటు పేర్కొనని ఎన్నో పనులను కూడా తమ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్‌యాదవ్, కౌన్సిలర్లు అజయ్, శ్రీకాంత్, డి.అశోక్, అమృతా సుధాకర్‌రెడ్డి, శ్రీను, స్రవంతి శ్రీకాంత్‌రెడ్డి, నార్సింగి మార్కెట్ చైర్మన్ దూడల వెంకటేశ్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలీ, మేనేజర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.